సాలూరు మండలం తుండ పంచాయితీ తుండ, చిన వూతగెడ్డ, చెల్లురువలస, అప్పన్నదొరవలస, ఉల్లిచింతలవలస గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమం చేశారు. .
పోలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు మండలపార్తీ అధ్యక్షులు ఆముదాల పరమేష్ ఆధ్వర్యంలో 500 మంది వైసీపీ నుండి టీడీపీ పార్టీలో చేరారు. సంధ్యారాణి గారు మాజీ సర్పంచ్ లు ఎరగడ ధర్మ, రౌతు భాస్కరరావు, వార్డు మెంబర్లు వెంకటమ్మ, చిలకమ్మ, పాలిక నూకయ్య మరియు కెలా పైడిరాజు, కృష్ణంరాజు, ఎరగడ నారాయణ, చెల్లురి పారయ్య, చెల్లురి ఐతయ్య, మీసాల రాము, వంజరపు సింహాలు, లక్ష్మణ తదితరులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరినవారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డామని, చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో, సంధ్యారాణి గారి మంచితనం, మాట ఇస్తే తప్పకుండా ఏ పని ఐనా చేసే దమ్మున్న నాయకురాలని అందుకే పార్టీలో చేరామని తెలిపారు.
సంధ్యారాణి గారు మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మీ కష్టాలను తీరుస్తానని, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయితీ ముఖ్య నాయకులు శ్రీరామ్ సత్తిబాబు, అరసాడ తిరుపతి, మండంగి నందయ్య, మండంగి కేసరి మరియు మండల నాయకులు బసవయ్య నాయుడు, అక్యాన తిరుపతి, దొర లక్ష్మణ, యుగంధర్, మాలతీదొర, కసినబోయిన తిరుపతి, మరిపి సింహాచలం, మత్స కళ, భాస్కరరావు, మజ్జి తవితయ్య, కృష్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.