filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 6; shaking: 0.000000; highlight: 1; motionR: 65536; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0067,0.0000; brp_del_sen: 0.1300,0.0000; delta:1; bokeh:1; ispap:1; papproctime: 2026:09:02 19:38:07; module: photo;hw-remosaic: false;touch: (0.65515876, 0.55236363);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 307.63818;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 65536;weatherinfo: weather:Cloudy, icon:1, weatherInfo:100;temperature: 40;zeissColor: bright;

విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి విగ్రహ తయారీకి పీఠ పూజ

సాలూరు: ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఈ విగ్రహ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ బుధవారం సాయంత్రం సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పీఠ పూజ నిర్వహించారు.

విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో భక్తుల దర్శనార్థం ప్రతిష్ఠించనున్న శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ విగ్రహాన్ని స్థానిక కుమ్మరి వీధిలో తయారు చేయించేందుకు పీఠాన్ని సిద్ధం చేశారు. ముందుగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమం నిర్వహించి, అనంతరం పూజించిన పీఠాన్ని భక్తులు, సంఘ సభ్యులు కలిసి కుమ్మరి వీధికి తీసుకెళ్లారు. అక్కడ విగ్రహ తయారీ కోసం పీఠాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేస్తున్న విరాట్ విశ్వకర్మ భగవాన్ విగ్రహానికి పీఠ పూజతో విగ్రహ తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగే మూడు రోజుల యజ్ఞ మహోత్సవానికి సాలూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి