సాలూరులో ఘనంగా చిన్న శ్రీను జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సిరి సహస్ర

మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్

*సాలూరు నియోజకవర్గం, సెప్టెంబర్ 3:*

ఈరోజు *ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి* జన్మదినం సెప్టెంబర్ 5వ తేదీ పురస్కరించుకుని సాలూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.

*మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పీడిక రాజన్న దొర గారు* వారి క్యాంప్ కార్యాలయంలో చిన్న శ్రీను గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి *చిన్న శ్రీను గారి కుమార్తె సిరమ్మ* ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండిన జీవితం గడపాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని చిన్న శ్రీను గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి