ఆలయ, కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి రూ.12 లక్షల విరాళం అందించిన మానేపల్లి ఈశ్వరరావు

సాలూరు: సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ మానేపల్లి ఈశ్వరరావు గారి మరణం తీరని లోటని సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆయన స్వర్గస్తులయ్యారు.

విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధికి, ముఖ్యంగా మద్వివిరాట్ పోతులూరి బ్రహ్మేంద్రస్వామి ఆలయ అభివృద్ధి, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మానేపల్లి ఈశ్వరరావు తన వంతు సహకారాన్ని అందించారు. తన జీవితకాలంలో సుమారు రూ.12 లక్షల మేర విరాళం అందించి సంఘం అభివృద్ధికి అండగా నిలిచారని సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన సహకారంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌లో సంఘ సభ్యులు ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఈశ్వరరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. ఈశ్వరరావు గారు విశ్వబ్రాహ్మణ సంఘ అభివృద్ధి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయనలాంటి మహోన్నత వ్యక్తిని కోల్పోవడం సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు.

ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన స్ఫూర్తితో సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని సంఘ సభ్యులు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి