విజయలక్ష్మి విజయనగరం విజయనగరం, జూన్ 19 : భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన *”వికసిత్ భారత్”*గా తీర్చిదిద్దాలనే మహోన్నత సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY)” దేశవ్యాప్తంగా ఉపాధి రంగంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుండి దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 200 ప్రధాన కేంద్రాలలో ఒకటైన విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం ఈ జాతీయ మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో నిర్వహించబడింది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY)” ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి మాట్లాడుతు దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారికి సామాజిక భద్రతను అందించడమే ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మొదటిసారి అధికారిక రంగంలో ఉద్యోగంలో చేరే యువతకు ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.15,000 వరకు ప్రోత్సాహకాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. అలాగే కొత్త ఉద్యోగాలను సృష్టించే యజమానులకు ప్రతి అదనపు ఉద్యోగిపై నెలకు రూ.3,000 వరకు ఆర్థిక మద్దతు అందించడం ద్వారా ఉపాధి కల్పనను మరింత ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ ఇండియా స్ఫూర్తితో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించి, యువశక్తిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం ద్వారా ‘వికసిత్ భారత్ – 2047’ లక్ష్య సాధనకు బాటలు వేస్తామని ప్రధానమంత్రి తెలిపారు. ఒకే క్లిక్‌తో దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు, లక్షలాది మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసిన ఘట్టాన్ని కలెక్టరేట్లోని భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రత్యక్షంగా వీక్షించిన యువత, మహిళ ఉద్యోగులు హర్షధ్వానాలతో స్వాగతించారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడ మాట్లాడుతూ “విజయనగరం యువతకు స్థానికంగానే నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జ్యూట్, ఫెర్రో అలాయ్స్, ఫార్మా, ఎంఎస్ఎంఈ రంగాల్లో కొత్త ఉద్యోగాల సృష్టికి ఈ పథకం అపూర్వ అవకాశాలను అందిస్తోంది. యువత ఉద్యోగాలు పొందడమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.” అని పిలుపునిచ్చారు. “విజయనగరం జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. పీఎం-వీబీఆర్‌వై పథకం ద్వారా మొదటిసారి ఉద్యోగంలో చేరిన యువతకు రూ.15 వేల వరకు ఆర్థిక సహాయం, కొత్త ఉద్యోగాలు కల్పించే సంస్థలకు నెలకు రూ.3 వేల వరకు ప్రోత్సాహకం అందించడం దేశంలో ఉపాధి రంగానికి ఒక విప్లవాత్మక మార్పు వస్తుందని, జిల్లాలోని జ్యూట్ పరిశ్రమలు, ఫెర్రో అలాయ్స్ యూనిట్లు, ఫార్మా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు ఈ పథకం ద్వారా మరింత విస్తరిస్తాయి. స్థానిక యువతకు స్థానికంగానే ఉపాధి లభించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. యువత ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది” అని ఎన్ డి. ఎ ప్రభుత్వ సారధి ప్రధాని నరేంద్రమాడి కృత్ఞతలు తెలిపారు. ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కమీషనర్ కణితి అవినాష్ కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నం రీజియన్ లో PMVBRY పధకం గురించి వివరిస్తూ PM-VBRY రిజిస్ట్రేషన్లు: 705, – తొలిసారి ఉద్యోగుల లబ్ధిదారులు: 2,073 మంది – పురుషులు 1,599, మహిళలు 474, పార్ట్ A ప్రోత్సాహకం: ₹61.12 లక్షలు, పార్ట్ B ప్రోత్సాహకం: ₹10.66 కోట్లు అని తెలిపారు. ఇందులో ప్రధాన రంగాలు: నిపుణుల సేవలు, పాఠశాలలు, కళాశాలలు, ట్రేడింగ్/వాణిజ్య సంస్థలు, ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లు ఉన్నారని తెలిపారు. ఉపాధి కల్పనలో విప్లవాత్మక సంస్కరణ – PM-VBRY పథకం కింద తొలిసారిగా సంఘటిత ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే, నెలకు రూ.1 లక్షలోపు వేతనం పొందే అర్హులైన యువతకు గరిష్టంగా రూ.15,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందించబడుతోంది. అదనంగా కొత్త ఉద్యోగాలను కల్పించే సంస్థలకు ప్రతి అదనపు ఉద్యోగిపై నెలకు రూ.3,000 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. తయారీ రంగ పరిశ్రమలకు ఈ ప్రోత్సాహాన్ని నాలుగు సంవత్సరాల వరకు పొడిగించడం దేశ పారిశ్రామికాభివృద్ధికి మరో బలమైన అడుగుగా నిలిచింది. సుమారు రూ.99,446 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా 3.5 కోట్లకు పైగా ఉద్యోగ అవకాశాలు, అందులో 1.92 కోట్ల తొలి ఉద్యోగార్థులకు ప్రత్యక్ష ప్రయోజనం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులకు పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు చేతుల మీదుగా అధికారిక నియామక పత్రాలు అందజేశారు. పీఎం-వీబీఆర్‌వై ద్వారా లబ్ధి పొందిన యువ ఉద్యోగులు, అత్యధిక స్థానిక ఉపాధి కల్పించిన పరిశ్రమల ప్రతినిధులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో గణనీయ సంఖ్యలో మహిళలు ఉండటం విశేషం. మహిళలు సంఘటిత రంగంలో పెద్దఎత్తున ఉపాధి పొందడం కుటుంబాల ఆర్థికాభివృద్ధికి, సమాజ సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. పీఎం-వీబీఆర్‌వై కార్యక్రమం విజయనగరం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి, యువత ఉపాధికి, మహిళా సాధికారతకు, సామాజిక భద్రతకు, ఆర్థిక ప్రగతికి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని సభలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కమీషనర్ కణితి అవినాష్ కుమార్, జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజరు ఎం.వి. కరుణాకర్, జిల్లా కార్మిక శాఖ ఉప కమీషనరు ఎస్ డి వి ప్రసాదరావు, కార్మిక శాఖ సహాయ కమీషనర్లు జి.ఎల్లాజీరావు, ఇన్స్పెక్టరు ఆఫ్ ఫ్యాక్టరీస్ సుధాకర్, లేబరు ఎన్ ఫొర్సుమెంటు ఆఫీసరు రుబల్ సింగ్, ESIC JOINT DY.DIRECTOR ESIC సోమేంద్రకుమార్ సాహు, విజయనగరం ఇంజనీరింగు మెషినరీ డీలర్స్ అసోసియేషను ప్రతినిధి, గోపాలకృష్ణ, CRDAI VIZIANAGARAM SECRETARY బి. సురేందర్, విజయనగరం ఆటోమెబైల్స్ డీలర్ అసోసియేషను ప్రసిడెంటు ఎం.సుధాకర్, విజయనగరం హోటల్ అసోపియేషన్ ప్రతినిధి, పి.ఎస్.ఎన్ రావు చాంబరు కామర్స్ ప్రతినిధి కె.శ్రినివాస్, శ్రీకాకుళం చాంబరు కామస్ ప్రతినిధి ఎన్. మోహన్, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, వివిధ పరిశ్రమల యజమానులు, ఉద్యోగులు, లబ్ధిదారులు, మహిళా ఉద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Spread the love టపా నావిగేషన్ యువత త్వరగా ఉద్యోగాలు పొందేలా సెంచురియన్ యూనివర్సిటీ నాలుగు కొత్త కోర్సులను రూపొందించింది: CUTM ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు