కోరుకొండ గ్రామం లో జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డిగువరం పర్యటించారు. ఆదర్శ రైతు గిరీష్ ను కలిసి వారి పొలాన్ని సందర్శించారు. 22 ఎకరాల్లో నవధాన్యాల తో ఉన్న పంటను పరిశీలించారు

. అదే పొలం లో ఉన్న ఫార్మ్ పాండ్ ను కూడా పరిశీలించారు. నవధాన్యాలు పంటను దున్ని సేంద్రీయ ఎరువుగా వినియోగిస్తామని, తదుపరి ఉద్యానపంటలైన అరటి, అశ్వగంధ, బొప్పాయి పంటలు వేస్తానని రైతు గిరీష్ కలెక్టర్ కు వివరించారు. సేంద్రీయ ఉద్యాన పంటలు పండించి జిల్లాకు మోడల్ గా నిలవాలని, ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని కలెక్టర్ రైతుకు తెలిపారు. ఈ సందర్భంగా రైతు కృషిని అభినందించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి