సునీత రెడ్డి విజయనగరం

రీ నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు**విద్యార్ధులు ప‌రీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి**జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి స‌మీక్ష‌*విజయనగరం, జూన్ 20 జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన‌ నిర్వహించనున్న జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష (రీ-నీట్ యుజి)కు ప‌క‌డ్బంధీ ఏర్పాట్లు చేఅయినట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి తెలిపారు. ఈ పరీక్షను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నీట్ ప‌రీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 1901 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై 5.15 గంటల వరకు కొనసాగే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం జిల్లా కలెక్టర్ పలు కీలక నిబంధనలను వివ‌రించారు. విద్యార్ధుల‌ను ఉద‌యం 11 గంట‌లు నుంచే ప‌రీక్షా కేంద్రంలోకి అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌ని, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తామని, నిమిషం ఆల‌స్య‌మైనా లోపలికి అనుమతించేది లేదని ఆయన అన్నారు. అభ్య‌ర్ధులు 1.40 క‌ల్లా ఖ‌చ్చితంగా త‌మ‌కు కేటాయించిన రూముకు చేరుకొని ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు రెండు కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఒక పోస్టుకార్డు సైజ్ కలర్ ఫోటో, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా త‌మ‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్దులు ముందురోజే ప‌రీక్షా కేంద్రాన్ని, త‌మ రూమును సంద‌ర్శిస్తే మంచిద‌ని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. వీటితో పాటు హ్యాండ్‌బ్యాగులు, బెల్టులు, ఆభరణాలు, లోహపు వస్తువులు మరియు అదనపు కాగితాలకు కూడా అనుమతి లేదని చెప్పారు. దుస్తుల విషయంలోనూ అభ్యర్థులు నిబంధనలు పాటించాలని, సాధారణ దుస్తులు, చెప్పులతో మాత్రమే రావాలని సూచించారు. ఇన్విజిలేటర్ల వారికి నిర్ధేశించిన‌ సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్దుల‌కు అవ‌స‌ర‌మైన త్రాగునీరు, మ‌రుగుదొడ్లు త‌దిత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. పార‌ద‌ర్శ‌క వాట‌ర్ బాటిళ్ల‌ను అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. పరీక్ష ముగిసేవరకు విద్యార్థులను బయటకు పంపించడం జరగదని తెలిపారు. త‌ల్లితండ్రులు ప‌రిక్ష ముగిసేవ‌ర‌కు ప‌రీక్షా కేంద్రంవ‌ద్ద ఉండ‌వ‌ద్ద‌ని కోరారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి పరీక్ష రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6.15 గంటల వరకు 08922-236947 నంబర్‌తో సహాయ కేంద్రాన్ని అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి