అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు సాలూరు పట్టణంలోని తన నివాసంలో *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర* అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గిరిజనుల హక్కులు,సంక్షేమం కోసం క్షత్రియుడైన అల్లూరి.సీతారామరాజు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని, అలాంటి మహనీయుడిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఇటీవల సాలూరులోని బంగారమ్మ కాలనీలో ఉన్న బీసీ హాస్టల్ నుంచి బంగారమ్మపేట ఎస్టీ హాస్టల్‌కు గిరిజన విద్యార్థులను రాత్రికి రాత్రే తరలించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఇది అత్యంత దారుణమని,విద్యార్థులు ఎక్కడ చదవాలనుకుంటున్నారో అక్కడే వారికి వసతి కల్పించి, వారి విద్యకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు, మహానుభావులు గిరిజన సంక్షేమానికి విశేషంగా కృషి చేశారని,ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా అదే బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి ఈ సమస్యపై దృష్టి సారించి గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల గిరిజన విద్యార్థులు మలేరియాతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలను ప్రస్తావిస్తూ,గిరిజన పిల్లల ప్రాణాల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.అల్లూరి సీతారామరాజు , ఎస్.ఆర్.శంకరన్న,బీ.డి.శర్మ వంటి మహనీయుల సేవా స్ఫూర్తిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి,ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్,ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఎం.నాయక్,గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌తో పాటు శాఖలోని అధికారులు ఆదర్శంగా తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి దండి.శ్రీనివాసరావు , విశాఖ జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు,మన్యం జిల్లా SIR పరిశీలకులు మేరువ గణేష్ ,వైసీపీ నాయకులు బంకురు.రామచంద్ర , మద్దెల.గోవింద్ , గుంట.రవి ,పతివాడ బాలాజీ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి