పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో నిర్వహించిన స్వాతంత్ర్య సమరయోధుడు, “మన్యం వీరుడు” అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతి ఉత్సవాల్లో *గౌరవ విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు* పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను గారు మాట్లాడుతూ, భీమిలి నియోజకవర్గంలోని పాండ్రంగి గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు గారు తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడని అన్నారు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు ధైర్యంగా ఎదురొడ్డి, గిరిజనుల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి త్యాగం, ధైర్యం, దేశభక్తి, నిబద్ధత ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, ముఖ్యంగా యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని, వారి త్యాగాలను భావితరాలకు తెలియజేస్తూ జాతీయ చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలు, దేశభక్తి, పోరాట స్ఫూర్తి శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచి, తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉంటాయని పేర్కొంటూ ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. Spread the love టపా నావిగేషన్ భారత రాజ్యాంగం పట్ల అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసిన యూట్యూబరుకు 14రోజుల జ్యుడిషియల్ కస్టడీ అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలి: మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర