*రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానం (OPS) మంజూరు పై హర్షం వ్యక్తం చేసిన 2004 బ్యాచ్ కానిస్టేబుళ్ళు … శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జూలై, 13న 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు విజయనగరం జిల్లా ఎస్పీ *శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందచేసారు.

ఈ సందర్భంగా 2003 నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS) వర్తింపజేస్తూ, జి.ఓ.నం.53 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2003 సం.లో తమ నోటిఫికేషన్ ఇచ్చింది మరియు 2026 సం.లో తమకు పాత పెన్షన్ విధానం మంజూరు చేసింది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారేనని సంతోషం వ్యక్తం చేసారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు భరోసా కలిపించారని, *”థ్యాంక్యు సిఎం సర్”* అంటు నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి.సౌమ్యలత, 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి