వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర& పార్వతిపురం మన్యం జిల్లా వైసీపీ పరిశీలకులు శరగడం. అప్పలనాయుడు గారు.
పీవీటీజీ మహిళ ప్రశాంతిపై అన్యాయ సస్పెన్షన్.. మంత్రి సంధ్యారాణి గారి పై మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు ఆగ్రహం
తొలి సంతకం హామీగా మిగిలిందేనా?..మంత్రి సంధ్యా రాణి గారు సమాధానం చెప్పాలి.
జనహృదయ విజేత,సంక్షేమ ప్రదాత,అభివృద్ధి విధాత, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు సాలూరు పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు,మన్యం జిల్లా వైసీపీ పరిశీలకులు శరగడం. అప్పలనాయుడు గారితో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పక్కనే ఉన్న బోసుబొమ్మ విగ్రహానికి కూడా పూలమాల వేశారు.ఆ తరువాత వైసీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు మాట్లాడుతూ,భారత రాష్ట్రపతి కులానికి చెందిన పీవీటీజీ మహిళ ప్రశాంతిని మంత్రి సంధ్యారాణి గారు కక్షగట్టి అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఇటీవల అన్నంరాజువలస పంచాయతీలో జరిగిన సమావేశానికి మంత్రి సంధ్యారాణి గారు వస్తున్నారని,ఆమెను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో చీపురువలస గ్రామంలోని ప్రశాంతి ఇంటి వద్ద పోలీసులు పెట్టి నిర్బంధించారని విమర్శించారు.మంత్రి సంధ్యారాణి గారికి ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. మంత్రి సంధ్యారాణి గారు, పోలీసులు వ్యవహరించిన తీరుపై మానవ హక్కుల కమిషన్‌కు ఎందుకు ఫిర్యాదు చేయకూడదని ప్రశ్నించారు.పాచిపెంట మండలంలోని పెద్దగడ్డ రిజర్వాయర్ నిర్మించిన ఘనత డాక్టర్ వైఎస్సార్ గారిదేనని పేర్కొన్నారు.ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు గారు ప్రకటించిన మేనిఫెస్టోను మంత్రి సంధ్యారాణి గారు సాలూరులో పెద్ద పెద్ద ఫ్లెక్సీల రూపంలో ప్రచారం చేశారని, అయితే నేటికీ ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు.అమలు కాని హామీలతో ఫ్లెక్సీలు కట్టించడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ANMల నియామకాల కోసం మంత్రి సంధ్యారాణి గారు పెట్టిన మొదటి సంతకం ఏమైందో ప్రజలకు చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారు.ఇటీవల బంగారమ్మ కాలనీలో ఉన్న బీసీ వసతిగృహంలోని ఎస్టీ విద్యార్థులను బంగారమ్మపేట ఎస్సీ హాస్టల్‌కు రాత్రికి రాత్రే తరలించారని,గిరిజన సంక్షేమ శాఖలో ఇదేనా పరిపాలన అని ప్రశ్నించారు.గిరిజన సంక్షేమ శాఖలో విద్యార్థులు చనిపోతే మంత్రి సంధ్యారాణి గారికి బాధ్యత లేదా అని నిలదీశారు.గిరిజన శాఖ మంత్రిగా గిరిజనులకు ఇదేనా న్యాయం,ఇదేనా మీ విద్యా విధానం అని ప్రశ్నించారు. ఎవరు సైకోలా మాట్లాడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారని, సంధ్యారాణి గారు సైకోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.మన్యం జిల్లా వైసీపీ పరిశీలకులు శరగడం అప్పలనాయుడు గారు మాట్లాడుతూ,ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని ఎగ్గొట్టారని విమర్శించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాజన్నదొర గారు మంచి వ్యక్తి అని,నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజల ఆశీస్సులతో గెలుపొందారని తెలిపారు. ఆయన నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,ఎంపీపీలు,మాజీ ఎంపీపీలు,వైస్ ఎంపీపీలు, మాజీ వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు,మాజీ ఎంపీటీసీలు,జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు,మండల అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు,సోషల్ మీడియా కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి