సాలూరు: సాంప్రదాయ పద్ధతుల్లో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ గ్రామస్థులకు సూచించారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో వినాయక మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్రతి వినాయక మండపం వద్ద ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని, మహిళా పోలీసు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. మండపాల వద్ద సురక్షిత విద్యుత్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అధిక శబ్దాలు, అసభ్యకర కార్యక్రమాలు, మద్యం, గొడవలకు దూరంగా ఉంటూ భక్తి, సంప్రదాయం, క్రమశిక్షణతో ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు. సాంప్రదాయబద్ధంగా, ఆదర్శంగా వినాయక ఉత్సవాలను నిర్వహించే గ్రామాన్ని ప్రోత్సహించేందుకు పోలీసు శాఖ తరపున రూ.5 వేల నజరానా అందజేస్తామని రూరల్ సీఐ రామకృష్ణ ప్రకటించారు. .. Spread the love టపా నావిగేషన్ సంకల్పం నెరవేరాలని సంతోషిమాతకు ఉజ్జాపన సమర్పణ బేబీ నాయన చేతుల మీదుగా పారాది లో సాఫ్ట్ బాల్ క్రీడా సందడి