పాచిపెంట మండలంలో ఘనంగా పోషణ్ మాసం–2026 కార్యక్రమం

పాచిపెంట ప్రాజెక్టు పరిధిలోని పి.కొనవలస సెక్టార్‌లో గుంటమామిడివలస అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ ఏ. జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, బాలామృతం గురించి అవగాహన కల్పించారు.

అలాగే ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో స్థానికంగా అందుబాటులో ఉన్న ఆకుకూరలు, కూరగాయలను తప్పనిసరిగా వండుకుని తీసుకోవాలని సూచించారు. తల్లులు పిల్లలకు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లులతో పాటు అంగన్వాడీ కార్యకర్త పి. రత్న, అంగన్వాడీ సహాయకురాలు కె. పోలమ్మ పాల్గొన్నారు.

పోషకాహారంపై అవగాహన పెంచుతూ.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోషణ్ మాసం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి