బొబ్బిలి, సెప్టెంబర్ 15: బొబ్బిలిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) స్పందించారు. రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే మంగళవారం సందర్శించి దీక్ష చేస్తున్న సోరు సాంబయ్య, లెంక సత్యం తదితరులతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా త్వరలోనే బొబ్బిలిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, బొబ్బిలి ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం దీక్షకులకు నిమ్మరసం అందించి రిలే నిరాహార దీక్షలను విరమింపజేశారు. బొబ్బిలి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 9 NEWS | రిపోర్టర్ శ్రావణ్ కుమార్ Spread the love టపా నావిగేషన్ చెకుముకి సైన్స్ సంబరాల్లో సాలూరు విద్యార్థుల సత్తా