సాలూరు, సెప్టెంబర్ 15: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు–2026లో సాలూరు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో సత్తా చాటిన అర్బన్, రూరల్ విభాగాలకు చెందిన మొత్తం ఆరుగురు విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అర్బన్ విభాగంలో డబ్బివీధి MH స్కూల్ నుంచి కె. ఇందు, జి. కీర్తన, రాజ్యలక్ష్మి సింగ్ జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. రూరల్ విభాగంలో బాగువలస ZPHS నుంచి చె. జాబిల్లి, జి. చరిష్మా, ఎం. అనురాధ జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఒక్కో పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులతో జట్లను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపుతున్నారు. విద్యార్థులలో విజ్ఞానంపై ఆసక్తిని పెంచడంతో పాటు, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయ కోణంలో అర్థం చేసుకునేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉంది. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు–2026లో పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు పోటీపడి, తదుపరి మండల, జిల్లా స్థాయిలకు ఎంపికవుతున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించనుంది. సైన్స్‌ను కేవలం పాఠ్యాంశంగా కాకుండా ప్రయోగాలు, పరిశీలన, ఆలోచన, విశ్లేషణతో అనుసంధానం చేసే విధంగా ఈ పోటీలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైన ఆరుగురు విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ సాలూరు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. 9 NEWS | స్టాఫ్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్ Spread the love టపా నావిగేషన్ ఇంజినీర్లకు విశ్వేశ్వరయ్యే స్ఫూర్తి నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బేబీ నాయన