హెటిరో ఉద్యోగ మేళాలో ప్రతిభకు పట్టం శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల వేదికగా 11 మంది అభ్యర్థుల ఎంపిక సాలూరు: యువతకు ఉపాధి అవకాశాలను చేరువ చేయాలనే లక్ష్యంతో హెటిరో ల్యాబ్స్, నక్కవానిపాలెం, అనకాపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళా విజయవంతంగా జరిగింది. స్థానిక శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ నియామక ప్రక్రియకు 25 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హెటిరో ల్యాబ్స్ ప్రతినిధులు అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలు, ప్రతిభను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థుల సామర్థ్యాన్ని వివిధ అంశాల్లో అంచనా వేసిన అనంతరం అర్హత, ప్రతిభ ఆధారంగా 11 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ గొర్జ భాస్కరరావు ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉద్యోగావకాశాల కోసం హాజరైన అభ్యర్థులకు నియామక ప్రక్రియ, సంస్థలోని అవకాశాలపై హెటిరో ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. విద్యార్థులు డిగ్రీ విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, అందుబాటులోకి వచ్చే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయంతో ఇలాంటి ఉద్యోగ మేళాలను నిర్వహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత చేరువవుతాయని కళాశాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఉద్యోగ మేళా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన హెటిరో ల్యాబ్స్ ప్రతినిధులు, అభ్యర్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ప్రిన్సిపాల్ గొర్జ భాస్కరరావు కృతజ్ఞతలు తెలిపారు. Spread the love టపా నావిగేషన్ యువతే మార్పుకు బలమైన వేదిక సామాజిక మాధ్యమాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి: మంత్రి సంధ్యారాణి