సాలూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం (PGRS)లో మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు.గ్రీవెన్స్‌లో అధికంగా రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, పెన్షన్ మరియు హౌస్ మాపింగ్ పై వినతులు రావటం తో భూ, రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు.అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు పేర్కొన్నారు. Spread the love టపా నావిగేషన్ సీతంలో ఘనంగా ఇంజినీర్ల దినోత్సవం