స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎమ్.సత్య ప్రసాద్ గారు,డీజీఎమ్ బిఎస్ఎన్ఎల్ విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు ప్రపంచం వేగంగా మారుతుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,ఆటోమేషన్ యుగములో ఉన్నాం కాబట్టి సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సు,రోబోటిక్స్,ఐఓటి,క్వాంటం టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు,మీ విద్య వ్యక్తిగత విజయంతో పాటు సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు.మరియు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కష్టపడే తత్వంతో ముందుకు సాగితే ఏ రంగంలో అయినా అద్భుతాలు సృష్టించవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా డాక్టర్ జి.సత్యనారాయణ గారు,ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్,విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్య అనేది కేవలం పాఠ్యాంశాలను నేర్చుకోవడం మాత్రమే కాదు.జ్ఞానం,నైపుణ్యాలు, సృజనాత్మకత,క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు మరియు మానవీయ విలువలను పెంపొందించుకునే గొప్ప అవకాశమని తెలియజేసారు.అలాగే వైఫల్యాలు నుండి కొత్త పాటలు నేర్చుకోవాలని తెలిపారు.ఈ కార్యకమానికి ప్రత్యేకఅతిథిగా బ్రహ్మకుమారి హేమలత గారు,గరివిడి నుండి వచ్చేసారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు మంచి స్నేహాలు,సానుకూల ఆలోచనలు మరియు ఆధ్యాత్మిక విలువలను అలవర్చుకుంటే మీ విద్యార్థి జీవితం మరింత ఆనందదాయకంగా ఉంటుందిని తెలిపారు.అలాగే ప్రతి విద్యార్థికి సెల్ఫ్ మోటివేషన్,పాజిటివ్ యాటిట్యూడ్ తో మెలగాలని కోరారు.ఈ సందర్భంగా అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మన విద్యా సంస్థల కుటుంబంలోకి నూతనంగా చేరిన ప్రథమ సంవత్సర బి.టెక్ విద్యార్థినీ విద్యార్థులందరికీ ఆత్మీయ స్వాగతం తెలిపారు.అనంతరం మాట్లాడుతూ కాలేజీలో విద్యార్థులకు ఉత్తమ మౌలిక సదుపాయాలు,పరిశ్రమల అవసరాలకు తగిన శిక్షణ,మారుతున్న గ్లోబల్ టెక్నాలజీకి అనుగుణంగా కోడింగ్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,డేటా సైన్స్ మరియు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలియజేశారు.అలాగే చదువుతో పాటు క్రీడలు,నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.మరియు నేటి యువత దేశానికి గొప్ప సంపదని చెపుతూ స్వామి వివేకానంద ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త,దేశభక్తుడు మరియు యువతకు స్ఫూర్తిదాయకమైన మహనీయుడు అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ జె.బాల భాస్కరావు గారు మాట్లాడుతూకాలేజీలో ఉన్న అధునాతన లాబ్‌లు,గ్రంథాలయం,అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం మరియు ప్లేస్‌మెంట్ అవకాశాలను అందిస్తుందిని తెలియజేస్తూ వీటిని సద్వినియోగం చేసుకుని,క్రమశిక్షణతో,కృషితో మీ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాని తెలియజేసారు.అలాగే విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ లు,సాంస్కృతి కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా చదువులో రాణించిన విద్యార్థులకు అలాగే క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిధుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు,పతకాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు బోధనేతర సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి