విజయనగరం, ఫిబ్రవరి 27 :
దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య రక్షణలో ఒక నూతన అధ్యాయానికి తెరలేవనుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పివి  (Human Papillomavirus) వ్యాక్సిన్ జాతీయ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా  శనివారం ఉదయం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో ప్రారంభించనుండగా, ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి సిహెచ్సిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు.

– ప్రధానంగా 14 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికలందరికీ ఈ టీకా ఉచితంగా అందించబడుతుంది.
-ఒకే డోస్ : 14 సంవత్సరాలు పూర్తయిన బాలికలకు కేవలం ఒక్క డోస్ టీకా మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది జీవితాంతం రక్షణ కల్పిస్తుందని వైద్య నిపుణులు ధృవీకరించారు.

*ఎక్కడ అందుబాటులో ఉంటుంది*
ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు మరియు ఇతర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో టీకా ఉచితంగా లభిస్తుంది.

*రిజిస్ట్రేషన్ మరియు భద్రత:* టీకా తీసుకునే ప్రతి బాలికను డిజిటల్ రికార్డులో (U-WIN పోర్టల్) నమోదు చేస్తారు. టీకా అనంతరం వారికి డిజిటల్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. టీకా తర్వాత వారికి వైద్య పర్యవేక్షణ కూడా ఉంటుంది.

*తల్లిదండ్రుల పాత్ర:* ఈ టీకా పూర్తిగా స్వచ్ఛందం. బాలికలకు టీకా వేయడానికి ముందు తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి లేదా ఓటీపీ తప్పనిసరి.
క్యాన్సర్ నివారణకు కీలకం
భారతదేశంలో మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతోంది. దీనిని ముందుగానే వ్యాక్సిన్ ద్వారా పూర్తిగా నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ చారిత్రక నిర్ణయం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్య భద్రత కల్పించడమే కాకుండా, క్యాన్సర్ రహిత సమాజ స్థాపనకు ఇది పునాది కానుంది.జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాలమేరకు వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాఠశాలలతో సమన్వయం చేసుకుంటూ, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడ బాలికలకు వేక్సిన్ వేస్తారు.ఏర్పాట్లు పరిశీలించిన హెల్త్ డైరెక్టర్ వీరపాండ్యన్*
హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభానికి సీహెచ్సీ వద్ద చేసిన ఏర్పాట్లను హెల్త్ డైరెక్టర్ వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి