టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం రెవిన్యూ హాలులో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* జూలై 16న ముఖ్య అతిధిగా హాజరై, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు మాట్లాడుతూ – ప్రజల ప్రాణాలను కాపాడే అత్యంత గొప్ప దానాల్లో రక్తదానం ఒకటని, ప్రతి ఆరోగ్యవంతుడూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. సమాజం పట్ల బాధ్యతతో టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చి స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించి రక్తదానం చేస్తున్న దాతలను అభినందించి, వారికి ప్రశంసాపత్రాలు అందచేసారు. రక్తదానం అనేది డబ్బుతో కొనలేని అమూల్యమైన సహాయం అని, ఒక యూనిట్ రక్తం ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అన్నారు. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, రక్తహీనతతో బాధపడుతున్న రోగులు, థలసేమియా వంటి వ్యాధులతో చికిత్స పొందుతున్న వారికి రక్తం అత్యవసరంగా అవసరమవుతుందని, అలాంటి సమయంలో స్వచ్ఛంద రక్తదాతలే అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తారని పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని, వైద్యుల సూచనల మేరకు నిర్దిష్ట వ్యవధిలో ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చని వివరించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో పరస్పర సహకారం, మానవత్వం, సామాజిక చైతన్యం మరింత బలపడుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. యువత ముఖ్యంగా సామాజిక బాధ్యతను గుర్తించి తరచూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు సభ్యులు, వైద్య బృందం, స్వచ్ఛంద రక్తదాతలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ జిల్లా పోలీసు శిక్షణా కళాశాలలో ఆధునిక జిమ్ మరియు వీఐపీ లాంజ్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్