ఈరోజు మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా సాలూరు పార్వతీపురం మన్యం

జిల్లా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ దగ్గర ఏఐటి యూసి జెండాను ఏఐటీయూసీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి మరియు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ యూనియన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ బలగరాధనాయుడు జెండాను ఆవిష్కరించడం జరిగినది అనంతరం ఆమె మాట్లాడుతూ యూనియన్ చారిత్రాత్మక పోరాట ఫలితంగా సాధించిన ఎనిమిది గంటల పని విధానం కేవలం పని సమయ పరిమితి కాదు అది మానవజాతి గౌరవానికి మానవత్వానికి ప్రతీక అని తెలిపారు నేడు అదే హక్కు మళ్ళీ సవాలు ఎదుర్కొంటుంది అని 10 గంటలకు 10 నుండి 12 గంటలకు పెంచే విధానాలు కార్మిక చట్టాల్లో సడలింపులు ఇవన్నీ కలిపి కార్మిక వర్గాన్ని తిరిగి శ్రమదాసువానికి నెట్టే ప్రమాదం సూచిస్తున్నాయని అంతేకాకుండా ప్రభుత్వాలు ఆర్థిక అభివృద్ధి పెట్టుబడుల ఆకర్షణ గ్లోబల్ పోటీ వంటి పదాలను వినిపిస్తూ కార్మిక చట్టాలను మారుస్తున్నాయని కానీ ఆ అభివృద్ధి ఫలాలు ఎవరికోసమని ప్రశ్నించారు కూలీ చేసే కార్మికుడిగా లేక లాభాలు కోసం పరిగెత్తే కార్పోరేటివ్ శక్తులు కానీ ఆమె ప్రశ్నించారు అంతేకాకుండా రోజుకు 12 గంటలు పని చేయాల్సిన పరిస్థితి ఒక వ్యక్తిని కేవలం శ్రమయంత్రంగా మార్చేస్తుంది అని అతనికి విశ్రాంతి ఉండదు. కుటుంబానికి సమయం ఉండదు. వ్యక్తిగత అభివృద్ధి అవకాశమే ఉండదు ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదని ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని ఆమె అన్నారు సమాజం ఒక కార్మికుడి మీద నిలబడుతుందని కానీ అదే కార్మికుడు జీవితం క్షీణిస్తే సమాజం మొత్తం క్షీణిస్తుందని ఆమె తెలిపారు అంతేకాకుండా అంగన్వాడి ఆశ మిడ్డేమీలు కాంట్రాక్ట్ వర్కర్స్ కి పని భారం తగ్గించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చీటికిమాటికి ఉద్యోగాలు తీసేస్తామని అధికారులు బ్లాక్మెయిల్ కి పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల గురించి ఆలోచించి అలాగే స్కీమ్ వర్కర్లు గురించి ఆలోచించి వారికి రోడ్డు వరకు భారీ ర్యాలీని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు విశ్వేశ్వరరావు కిరణ్ శివ ఆర్టీసీ యూనియన్ నాయకులు నాయుడు మరియు స్క్రాప్ వర్కర్స్ హాస్పిటల్ వర్కర్స్ ఆర్టీసీ వర్కర్స్ పాల్గొన్నారు సివిల్ సప్లై అమానీలు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి