PTR NAIDU చీపురుపల్లి చీపురుపల్లిలో “ఇంటింటి ప్రచారం” కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రభుత్వం ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమం మరియు సుపరిపాలనను నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ఉద్దేశించిన “ఇంటింటి ప్రచారం” కార్యక్రమంపై అవగాహన కోసం ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అదేవిధంగా, ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను క్రమం తప్పకుండా ‘మైటీడీపీ’ (MyTDP) యాప్లో నమోదు చేయాలని ఈ సందర్భంగా కళావెంకటరావు గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ అబ్జర్వర్ పుచ్చల విజయ్ కుమార్ గారితో పాటు డివిజన్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వార్డు ఇన్ఛార్జ్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, యూనిట్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్లు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే కళా వెంకట్రావు