పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి వర్మకు ఘన సన్మానం గుంటూరు, అక్టోబర్ 15: ప్రపంచ చేతులు శుభ్రం చేసుకునే దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులోని స్టేట్ పెన్షనర్స్ హాల్లో మానవ హక్కుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ స్వచ్ఛంద సేవకులకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించిన స్వచ్ఛంద సేవకులను ఈ సందర్భంగా గుర్తించి సత్కరించారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా మానవ హక్కుల ఫౌండేషన్ అధ్యక్షురాలు లక్ష్మి వర్మను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయ ఓఎస్డీ శ్రీ అశోక్ బాబు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది శ్రీమతి శైలజ, మానవ హక్కుల ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డపాటి దాసు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు మెమొంటోలు, శాలువాలు, ప్రశంసాపత్రాలు, గజమాలలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. ఇందిరా ప్రియదర్శిని, జాతీయ కార్యదర్శి శ్రీమతి జె. శ్రీలత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. సమాజ అభ్యున్నతికి, ప్రజాసేవకు అంకితభావంతో కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను గుర్తించి గౌరవించడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. Spread the love టపా నావిగేషన్ అలకలు తీర్చే వేళాయెనా..? ఎన్నికల వేళ సామాజిక వర్గాల బుజ్జగింపుల్లో ప్రజాప్రతినిధులు! ఎన్నికల వేళ ఫ్లెక్సీల గోల!