గజపతినగరంలో రహదారి మరియు చంపావతి నది ని ఆనుకుని పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్… గజపతినగరం లో మరొక్క వారం రోజులలో గజపతినగరం గ్రామదేవత బంగారమ్మ తల్లి వరాల పండుగ ఉన్నది అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు ప్రక్కన మరియు చంపావతి నదిని ఆనుకొని ఇటీవల కొన్ని నెలల నుంచి బంగారమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గం పక్కన గజపతినగరం మరియు పురుటిపెంట గ్రామాలకు సంబంధించిన చెత్తను డంపింగ్ యార్డ్ నిమిత్తం కేటాయించిన స్థలంలో కాకుండా రోడ్డు ప్రక్కన వేస్తున్నందువలన వెళ్లే రహదారిలో భరించలేని దుర్వాసన వస్తుంది… గ్రామంలో పండగ ఉన్నందువలన అదే దారిలో అమ్మవారి ఆలయానికి సుమారుగా మూడు వేల మంది పైన భక్తులు వెళ్తారు కావున అమ్మవారి పండగకు కొన్ని రోజులు సమయం ఉన్నందున త్వరితగతిని గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది దుర్వాసన కలగకుండా త్వరగా తొలగిస్తారని మనవి… ఆ మార్గంలో వెళితే అమ్మవారి ఆశీస్సులు కంటే అనారోగ్యం తప్పనిసరిగా వస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… Spread the love టపా నావిగేషన్ తాటిపూడి రైతులకు గొర్రెపాటి బుచ్చి అప్పారావు మార్గదర్శకులు _ మంత్రి కొండపల్లి శ్రీనివాస్