22.9.2024 పాచిపెంట మండలం, కొట్టుకు పెంట పంచాయతీ, గోగడ వలస గ్రామానికి చెందిన కోట లక్ష్మణరావు తమ్ముడు అయినా కోట పోలి రాజు వయసు 37 సంవత్సరాలు అను అతను కూలి పనులు చేసుకొని జీవిస్తున్నట్లు, నిన్నటి దినము అనగా తేదీ 21.9. 2024 సాయంత్రం 6:30 గంటల సమయంలో తన గ్రామానికి సమీపంలో కుడుమూరు జంక్షన్ వద్ద మట్టి రోడ్డు వైపు నడుచుకుని వెళ్తుండగా వెనుక నుండి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు సంబంధించిన లారీ వచ్చి గుద్దినట్లు మరియు తన తమ్ముడు పోలి రాజు శరీరం పైనుండి సదరు వాహనం వెళ్లటం వలన తీవ్రమైన గాయాలు కలిగి అక్కడికక్కడే మరణించినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మృతుడు కోటపోలి రాజు, వయసు 37 సంవత్సరాలు, గోగడవలస గ్రామం, కోటకి పెంట పంచాయతీ.
మృతునికి ఇద్దరు కుమార్తెలు కలరు.