మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి



ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) మరియు హోం ట్రయాంగిల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మెప్మా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరియు సామాజిక సాధికారతకు కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే, హోం ట్రయాంగిల్ వంటి సేవా రంగ సంస్థలు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సహాయపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, చిన్నతరహా వ్యాపారాలను ప్రోత్సహించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తెలియజేశారు

గృహ సేవలు, మరమ్మతులు, మరియు ఇతర అవసరాల కోసం వృత్తిపరుల సేవలను అందించడంలో మహిళలకు మద్దతు అందించడమే కోటనుప్రభువుతో లక్ష్యం అని మంత్రి సంధ్యారాణి తెలిపారు.


ఈ కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించబడ్డాయి. ఇందులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సాంప్రదాయాలను ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ ఉత్సాహభరిత వాతావరణాన్ని తీసుకురావడంతో పాటు, మహిళల శ్రేయస్సు కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా నిలిచింది అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంస్థలు కలిసి పనిచేయడం సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది అని మంత్రి తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *