వర్షాకాలం ప్రారంభం… సంచి డాక్టర్లు, దందా పై ఆందోళన

వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు సంచి డాక్టర్లు, ఆర్‌ఎంపీలు గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో తమ వైద్య సేవల పేరుతో ప్రజలను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మలేరియా కిట్లు, రక్త పరీక్షలు, ఇళ్ల వద్దే ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం ఉంది. గుర్తింపు పొందిన ప్రైవేటు వైద్యశాలలో వైద్య ఖర్చులు భరించలేని ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మలేరియా పరీక్షలు సహా అనేక వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడాన్ని కొందరు ఆసరాగా చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు.

ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇటువంటి అక్రమ వైద్య కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే, జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు గుర్తింపు పొందిన వైద్యులు లేదా ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రమే ఆశ్రయించాలని అధికారులు గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు సూచించాలి అని కోరుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి