చీపురుపల్లి: గత రెండు రోజుల క్రితం జరిగిన దళిత క్రిస్టియన్ మహాసభలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిపై జడ శ్రావణ్ కుమార్ మరియు ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జనసేన నాయకులు చీపురుపల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, “రాజకీయ విమర్శలు చేసే హక్కు అందరికీ ఉంది. కానీ మతం పేరిట, కులం పేరిట సభలు నిర్వహించి ఆ వేదికను రాజకీయ దుష్ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటు. దళిత క్రిస్టియన్ మహాసభ పేరుతో జరిగిన కార్యక్రమంలో దళితుల గురించి గానీ, క్రిస్టియన్ల సమస్యల గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కేవలం హిందూ ధర్మాన్ని, పవన్ కళ్యాణ్ గారిని దూషించడం కోసమే ఈ సభను నిర్వహించారు. ఇది జనసేన నాయకులు, కార్యకర్తల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది” అని అన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరం. కాబట్టి జడ శ్రావణ్ కుమార్ మరియు ప్రశ్న రావణ్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తవిటి నాయుడు, చిన్నమనాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు. Spread the love