ధరణి పేరుతో నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యం తక్కువ ధరకే అందుబాటులోకి విజయనగరం: పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధరణి పేరుతో ఫోర్టిఫైడ్ బియ్యం విక్రయాలను స్థానిక ఆర్అండ్బీ రైతు బజార్లో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బి. శాంతి, మార్కెటింగ్ ఏడీ రవి కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ధరణి బియ్యం విక్రయాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. బీపీటీ బియ్యం కిలో రూ.49, కేఎన్ఎం బియ్యం కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉండేలా ఫోర్టిఫికేషన్ చేసినట్లు వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసరావు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి లీలావతి తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ తోపుడు బండి ప్రారంభోత్సవంలో సిరమ్మ