సాలూరు: శ్రావణ మాసం ఐదో శుక్రవారం సందర్భంగా సాలూరులోని కామాక్షి అమ్మవారి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. శ్రావణ మాసంలో శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉండటంతో మహిళలు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఉదయం నుంచే వర్షం కురుస్తున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి, తమ సౌభాగ్యం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు వ్రతాలు ఆచరించి, ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలాలు అందజేశారు. శ్రావణ మాసం చివరి శుక్రవారాల్లో ఒకటైన ఈ రోజున అమ్మవారి ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. వర్షం కారణంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. 9 న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్ Spread the love టపా నావిగేషన్ సంకల్పం నెరవేరాలని సంతోషిమాతకు ఉజ్జాపన సమర్పణ