పాచిపెంట: పాచిపెంట ప్రాజెక్టు పి.కొనవలస సెక్టార్ పరిధిలోని గుంటమామి డివలస అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం–2026 కార్యక్రమాన్ని సూపర్‌వైజర్ ఏ. జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, బాలామృతం తదితర పోషకాహారంపై అవగాహన కల్పించారు. రోజువారీ ఆహారంలో స్థానికంగా అందుబాటులో ఉండే ఆకుకూరలు, కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకుని వండి తినాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో అవసరమని, గర్భిణీలు, బాలింతలు కూడా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూపర్‌వైజర్ ఏ. జ్యోతి వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లులతో పాటు అంగన్వాడీ కార్యకర్త పి. రత్న, అంగన్వాడీ సహాయకురాలు కె. పోలమ్మ పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ వేల్పూర్ గ్రామానికి చెందిన దొడ్డా సాయి, శిరీష తమ మూడేళ్ల బాలుడుని వదిలీ గోదారిలో దూకిన దంపతులు.