విజయనగరం, ఆగస్టు 17: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే తలమానికం అని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్ రావు (చిన్నశ్రీను) అభివర్ణించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి డోమెస్టిక్ ఆపరేషన్స్ మొదలయాయ్యి. విమాన సర్వీస్ లు మొదలైన తొలి రోజు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో ప్రయాణించి భోగాపురం విమానాశ్రయంలో దిగిన చిన్నశ్రీను తన అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. విజయనగరంలో పుట్టిన బిడ్డగా తొలి రోజు హైదరాబాద్ నుంచి మన ప్రాంత విమానాశ్రయంలో కాలు పెట్టడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. విమానం టేకాఫ్ ఐన సమయంలో విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయమని ఎయిర్ హోస్ట్ లు అనౌన్స్ చేసినపుడు చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. ఏది ఏమైనప్పటికీ విజయనగరం జిల్లా ప్రగతికి, అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతో దోహద పడుతుందని జెడ్పి ఛైర్పర్సన్ చిన్నశ్రీను ఆశాభావం వ్యక్తం చేశారు. Spread the love టపా నావిగేషన్ పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి