పార్వతీపురం: జిల్లాలోని కురుపాం ఏకలవ్య పాఠశాలలో జరిగిన సంఘటనపై దర్యాప్తు జరగాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శనివారం కాంగ్రెస్ పార్టీ డిసిసి వంగల దాలినాయుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గొట్టాపు రేణుక, పట్టణ అధ్యక్షురాలు బసవ వసుంధర, మహిళా నాయకురాలు వారణాసి తదితరులు పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో డిడి ఏ.విజయశాంతితో సాక్షి దినపత్రికలో వచ్చిన కురుపాం ఏకలవ్య పాఠశాలలో జరిగిన సంఘటన విషయమై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల/ కళాశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థినులకు ఇలా జరగటం బాధాకరమన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలన్నారు. బాధ్యులను చట్ట ప్రకారం శిక్షించాలన్నారు. గతంలో కూడా కురుపాం ఏకలవ్య పాఠశాలలో పలు సంఘటనలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆ పాఠశాలతో పాటు ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆడపిల్లల పాఠశాలలు/ కళాశాలలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇటువంటి సంఘటనల వలన విద్యార్థులు చదువుకు దూరమై భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయాన్నారు. అలాగే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఆడపిల్లల పాఠశాలలో మహిళ స్టాఫ్ నే నియమించాలన్నారు. ప్రస్తుత రోగాల సీజన్ లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయా వసతి గృహాలలో ఏ ఎన్ ఎం లను నియమించాలన్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మినరల్ వాటర్ అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రత, పారిశుధ్యం మెరుగుదల పాటించాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, టైఫాయిడ్, పచ్చకామెర్లు, రక్తహీనత తదితర రోగాలు విద్యార్థులు దరి చేరకుండా అప్రమత్తం కావాలన్నారు. మెనూ పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. విద్యార్థుల మరణాలు లేకుండా ముందు నుండే అప్రమత్తం కావాలన్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్లేటప్పుడు వైద్య పరంగా ట్రాక్ చేయాలన్నారు. ఆడపిల్లల పాఠశాలలు/ కళాశాలలో టీనేజ్ ప్రెగ్నెన్సీ పై అవగాహన తరగతులు నిర్వహించాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. నెలవారి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. Spread the love టపా నావిగేషన్ అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలి: మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర వర్షాకాలం ప్రారంభం… సంచి డాక్టర్లు, దందా పై ఆందోళన