పశువులను తరుచూ అక్రమంగా రవాణా చేస్తూ, విజయనగరం జిల్లా (9 కేసులు), తూర్పు గోదావరి జిల్లా (3 కేసులు), అనకాపల్లి జిల్లా (1 కేసు) మొత్తం 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజమహేంద్రవరం, బొమ్మూరు గ్రామానికి చెందిన “భరత్ రాఘవ @ మాంసం నాని” అనే వ్యక్తిపై రౌడీషీట్ తెరిచామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ఆగష్టు 12న ఒక ప్రకటనలో తెలిపారు. పశువుల అక్రమ రవాణా మరియు క్రూరత్వానికి పాల్పడటం వంటి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో పశువుల అక్రమ రవాణా, అక్రమ తరలింపు మరియు క్రూరత్వాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా వాహన తనిఖీలు చేయడంతో పాటు, అనుమానాస్పదంగా పశువులను తరలించే వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని చెప్పారు. ఇటీవల తన అనుచరులతో ముఠాలుగా ఏర్పడి, అర్ధ రాత్రి పూట మారుమూల గ్రామాలు, అడ్డదారుల్లో, చిన్న సందుల ద్వారా చిన్న చిన్న బొలెరో వాహనాలలో పశువులను కుక్కి, తగిన ఆహారం, నీరు అందించకుండా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశంకు అక్రమంగా రవాణా చేస్తున్న “భరత్ రాఘవ @ మాంసం నాని” అనే వ్యక్తిపై రౌడీషీట్ తెరిచామని తెలిపారు. పశువుల అక్రమ రవాణాతో పాటు ఇతర నేరాలు కూడా ఇతనిపై ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. భరత్ రాఘవతో పాటు మరికొంతమంది నిందితుల ప్రమేయం ఈ అక్రమ రవాణాలో వున్నట్లు గుర్తించామని, వారిపై కూడా త్వరలోనే కఠిన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న అతని ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో కూడా నేరాలకు పాల్పడకుండా పర్యవేక్షించేందుకు అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పశువులను అక్రమంగా తరలించడం, వాటిని ఇరుకైన చిన్న వాహనాల్లో కుక్కి తీసుకెళ్లడం, తగిన ఆహారం, నీరు అందించకుండా రవాణా చేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. పశువులను అక్రమంగా రవాణా చేసే ముఠాలు, వారికి సహకరించే వ్యక్తులు, వాహన యజమానులు, డ్రైవర్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా మార్గాల్లోనూ తనిఖీలను ముమ్మరం చేసామని చెప్పారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయిల్ 100/112కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి, వారి కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారంతో పశువుల అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికడతామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ తెలిపారు. Spread the love టపా నావిగేషన్ 11 నూతన తల్లి–బిడ్డ ఎక్స్ప్రెస్ (102) వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి