విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీసు శిక్షణా కేంద్రంలో స్టైపెండరీ ట్రైనీ క్యాడెట్ కానిస్టేబుల్స్ తుది పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆగస్టు 10న తెలిపారు. తుది రాత పరీక్షలను పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్పీ గారు పోలీసు శిక్షణ కేంద్రంను సందర్శించి, రాత పరీక్ష నిర్వహణను తీరును స్వయంగా పరిశీలించారు.

జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్ మాట్లాడుతూ – సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ఏపీఎస్పి బెటాలియన్ లకు చెందిన శిక్షణ కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారన్నారు. శిక్షణ ముగింపు దశలో ఉన్నందున తుది రాత పరీక్షలను ఈ నెల 8 నుండి 13 వరకు పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం, ఈ నెల 17 నుండి 19 వరకు ఫైరింగ్ పరీక్షలు, 22 నుండి 28 వరకు ఔట్ డోర్ పరీక్షలను శిక్షణ కానిస్టేబుల్స్ కు నిర్వహిస్తామన్నారు. జిల్లా శిక్షణ కేంద్రంలో త్వరలో సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని, శిక్షణ కానిస్టేబుల్స్ కు సెప్టెంబర్ 2 నుండి 15 వరకు కంప్యూటర్, సిసిటియన్ఎస్ శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.

అనంతరం, జిల్లా ఎస్పీ శిక్షణ కానిస్టేబుల్స్ అందిస్తున్న భోజనం, వసతులు, తరగతి గదులను పరిశీలించి, శిక్షణ ఇచ్చే ఇండోర్, ఔట్ డోర్ సిబ్బందితో మమేకమై, శిక్షణ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిటిసి స్టోర్స్ ను పరిశీలించి, కాలాతీతం అయిన పుస్తకాలు, మెటీరియల్ ను సంబధిత అధికారుల అనుమతితో త్వరితగతిన డిస్పోస్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిటిసి డీఎస్పీ పి.నారాయణరావు, డిఎస్పీ వెంకట రమణ, సిఐ ఏవీ లీలారావు, బి.లలిత, రిజర్వు ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు, ఎస్ఐ మురళీ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి