పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి అని ఆర్ఆర్ ప్యాకేజీకి అర్హత కలిగినటువంటి యువకులకు ప్యాకేజీ ఇవ్వకపోవడం ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు జెన్నీ రామయ్య కోరాడ ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఆర్ ప్యాకేజీకి అర్హత కలిగినటువంటి 18 సంవత్సరములు వయస్సు నిండినటువంటి యువకులు ప్రభుత్వం పేర్లను ప్రకటించి ప్యాకేజీ ఇవ్వకుండా నిరాశపరిచారని అటువంటి యువకులంతా నిర్వాసితు గ్రామాల్లో అయినా కేసలి కోటికి పెంట,మడవలస తురాయిపాడు, కుమ్మరివలస, ఎర్రడ్ల వలస, నిర్వాసిత గ్రామా లలో ఉన్నారని అన్నారు . వీరికి ప్రత్యేకంగా మరల గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు ఇప్పటికే అనేకమంది నిర్వాసిత గ్రామాలలో యువకులు వలసలు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి