విజయనగరం జిల్లాలో ఆగస్టు 22న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పర్యటనలు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు ప్రణాళిక, పటిష్టమైన భద్రతా చర్యలు, అధికారుల సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారు మాట్లాడుతూ – ఎల్.కోటలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనతో పాటు, విజయనగరం పట్టణంలోని దాసన్నపేట ప్రభుత్వ పాఠశాల, చెల్లూరులో పార్టీ కార్యకర్తలతో శ్రీ నారా లోకేష్ గారి సమావేశం, అలాగే విటి అగ్రహారం వై-జంక్షన్ వద్ద స్వాగత కార్యక్రమాల నేపథ్యంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సుమారు 1,000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎల్.కోటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్, ఎమ్మెల్యే నివాసం, హెలిప్యాడ్ నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ఉన్న మార్గం, రూఫ్‌టాప్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అదేవిధంగా జిల్లా కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి విటి అగ్రహారం వై-జంక్షన్ వద్ద పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు. శ్రీ నారా లోకేష్ గారు విద్యార్థులతో మమేకమయ్యే దాసన్నపేట ప్రభుత్వ పాఠశాల, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యే చెల్లూరు ప్రాంతాలను జిల్లా ఎస్పీ ముందుగానే సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు భద్రతాపరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఒకే రోజున జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యుల పర్యటనలు జరగడంతో జిల్లా పోలీసుశాఖ ముందస్తుగా సమగ్ర ప్రణాళిక రూపొందించి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు చర్యలను సమర్థవంతంగా నిర్వహించింది. పర్యటనలకు ముందుగానే చేపట్టిన భద్రతా చర్యలు, నిరంతర పర్యవేక్షణ, అధికారులు–సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారు తెలిపారు. Spread the love టపా నావిగేషన్ ప్రధాని నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు భేటీ భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర