పార్వతీపురం మన్యం జిల్లా.

పార్వతీపురం మన్యం జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తూ, ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కీ.శే.లు పి.రవి(PC -602) గారి కుటుంబానికి స్టేట్ బ్యాంకు పోలీసు సేలరీ ప్యాకేజ్ ప్రయోజనంగా మంజూరు చేసిన రూ.కోటి రూపాయల చెక్ ను ఆమె సతీమణి శ్రీమతి లలిత గారికి స్టేట్ బ్యాంకు అధికారుల సమక్షంలో ఆగస్టు 25న *జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్* గారి చేతుల మీదుగా జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.

*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ మాట్లాడుతూ* – జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న పోలీసు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, అందరికీ స్టేట్ బ్యాంకు పోలీసు సేలరీ ప్యాకేజ్ ను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఈ ప్యాకేజ్ ప్రయోజనంలో భాగంగా ఎవరైనా పోలీసు ఉద్యోగి విధి నిర్వహణలో భాగంగా ప్రమాదవసాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ప్రస్తుతం రూ.1కోటి, సాదారణ మరణం సంబవిస్తే 10 లక్షలు ఆర్ధిక సహాయంను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందించనుందన్నారు. ఇందులో భాగంగా వీరఘట్టం పోలీసు స్టేషనులో కానిస్టేబుల్ గా కీ.శే.లు పి .రవి పని చేస్తూ, రోడ్డు ప్రమాదంలో తే 17.01.2026 దిన మరణించారు. ఇదే విషయమై స్టేట్ బ్యాంకు అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపగా స్టేట్ బ్యాంకు అధికారులు మరణించిన రవి సతీమణి లలిత గారికి పోలీస్ శాలరీ ప్యాకేజీ ప్రకారం ప్రయోజనంగా కోటి రూపాయలను మంజూరు చేసారన్నారు. బ్యాంకు అధికారుల సమక్షంలో లలిత గారికి కోటి రూపాయల చెక్ ను అందజేయడమైనదన్నారు.

జిల్లా పోలీసుశాఖ ఎల్లప్పుడూ అందుబాటులో అండగా ఉంటుందని, ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా వచ్చి కలవవచ్చునని ఇతర బెనిఫిట్ లను అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు. ఎస్.బి.ఐ. ద్వారా వచ్చిన డబ్బులను వృదాగా ఖర్చు చేయవద్దని జిల్లా ఎస్పీ గారు సూచించారు.

ఈ కార్యక్రమంలో *అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐ లు నాయుడు,రాంబాబు,ఆదినారాయణ,విజయనగరం కంటోన్మెంట్ ఎస్బిఐ బ్రాంచ్ చీఫ్ మేనేజరు రఘురామ్ గార్లు మరియు కానిస్టేబుల్ సతీమణి* పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You missed