*గిరిజన నాయకులకు పదవులు తప్ప గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు భరోసా కల్పించలేని పరిస్థితి*

*ఆంధ్రప్రదేశ్ గిరిజన సంగం జిల్లా కమిటీ సభ్యుడు హెచ్ రామారావు గిరిజన మంత్రి గారికి గిరిజన ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వానికి డిమాండ్*

*పార్వతీపురం మన్యం జిల్లా పెద్ద శాఖ పంచాయతీ పెద్ద శాఖ గ్రామంలో ఈరోజు* *అనగా సోమవారం రైతులతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు హెచ్ రామారావు సిఐటియు మండల నాయకుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ మన గిరిజన సంఘం నాయకులే మనకు అభివృద్ధి వైపు నెట్టే పరిస్థితి లేదని ఈ సందర్భంగా నాయకులు అన్నారు అనంతరం నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల అవుతున్న మన గిరిజన నాయకులు గెలిచి* *పదవులు వచ్చిన తర్వాత కనిపించకుండా పోతున్నారని గతంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి మేడం మరియు పీడక రాజన్న దొర కూడా మంత్రి పదవి చేశారు దొర అలాగే ఇప్పుడు సంధ్యారాణి మేడం కూడా మంత్రి పదవి చేస్తున్నారు అలాగే మన నియోజకవర్గంలో ఇప్పుడు జగదీశ్వర్ మేడంగారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో విజయరామరాజు గారు కూడా మంత్రి పదవులు చేశారు* *ఎంతమంది గిరిజన నాయకులు మంత్రి పదవులు చేసిన నేటికీ గిరిజన గ్రామాలకి డోలి మొతలు లేకుండా రహదారులు ఎందుకు వేయలేక పోతున్నా రో తెలియని పరిస్థితి ఉందని అలాగే జీవో నెంబర్ 3ని అలాగే 1/70 చట్టాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితి మన గిరిజన నాయకులకు ఉందని అలాగే ఎంతోమంది గిరిజన విద్యార్థులు* *చదువుకుంటున్న మారికవలస వద్ద ఉన్న స్కూలు కూడా ఎత్తివేస్తుంటే ఒక్క గిరిజన మంత్రి గారు గాని గిరిజన ఎమ్మెల్యేలు గానీ మాట్లాడిన పరిస్థితి ఉందని ఇదేనా గిరిజన ఓట్లు దండుకొని పదవులు పొందిన తర్వాత గిరిజనులకే మోసం చేసే పరిస్థితి ఉందని ఇది మారాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇ ప్పటికైనా అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించాలి మంచినీటి సౌకర్యాలు కల్పించాలి విద్య వైద్యం అందించే విధంగా ముందుకు వెళ్లాలని వీటితోపాటు జీవో నెంబర్ 3ని* *పునరుద్ధరించాలి 1/70 చట్టాన్ని పూర్తిస్థాయిలో గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాలి ముఖ్యంగా మారిక వలసలో ఉన్న స్కూల్స్ ని యదాస్థితిగా నడపాలని ఈ విధంగా కూటమి ప్రభుత్వం లో ఉన్న మంత్రిగారు ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో గిరిజన సమస్యలపై దృష్టి పెట్టాలని లేనియెడల ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ గిరిజన సంగం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రిగారికి తెలియజేయుచున్నాము ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘం నాయకులు మధు కైలాస్ మరి కొంతమంది యువకులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి