సాలూరు పుర ఎన్నికలకు సిద్దమైన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటితో భేటీ మునిసిపల్ ఎన్నికలలో సత్తా చాటేందుకు సిద్ధం జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కార్యక్రమంలో భాగంగా అరకు పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు గర్భాన సత్తిబాబు, వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో ఈరోజు సాలూరు నియోజకవర్గంలోని సాలూరు మున్సిపాలిటీలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని, పార్టీ బలోపేతంతో పాటు కూటమి విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమం లో అరకు కమిటీ సభ్యులు పొట్టా శేఖర్ అరకు పార్లమెంటరీ నాయకుడు k శివ కృష్ణ, పట్టణ నాయకులు మీసాల నవీన్,లీగల్ సెల్ నాయకులు సుశాంత్ కుమార్ పాడి,గొర్లె తిరుపతి నాయుడు,నలమాటి అశోక్,మీసాల సతీష్, భోను హేమంత్,మాదిరెడ్డి సతీష్,సాయి ప్రవల్, తారక్, టేకి దుర్గా ప్రసాద్,యుదిస్టర్ రావ్, బోను శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు Spread the love టపా నావిగేషన్ వినాయక చవితి ఉత్సవాల్లో అప్రమత్తతే అసలైన భద్రత