శ్రావణ్ కుమార్ | 9 News Reporter | బొబ్బిలి

బొబ్బిలి మండలం పారాది వద్ద నిర్మించిన కొత్త బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు సంబంధిత అధికారులు అధికారికంగా అనుమతి ఇచ్చారు. అధికారుల పరిశీలన అనంతరం బ్రిడ్జిపై నుంచి వాహనాలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో వాహనదారులు అధికారుల అనుమతితో కొత్త బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగించవచ్చు. అయితే బ్రిడ్జిపై ప్రయాణించే సమయంలో తక్కువ వేగంతో, అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.

ఇతర వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు సూచించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి