బైక్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్ 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం వీరఘట్టం, సెప్టెంబర్ 10: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బైక్ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను పాలకొండ డీఎస్పీ M. రాంబాబు వెల్లడించారు. వీరఘట్టం పోలీస్ స్టేషన్ Cr.No.77/2026, U/s 303(2) BNS కింద నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులు: 1. పొండూరు మురళీకృష్ణ, వయస్సు 22 సంవత్సరాలు, BC కాలనీ, వీరఘట్టం గ్రామం, మండలం. 2. చెట్ల చంద్రశౌలి, వయస్సు 28 సంవత్సరాలు, బర్ణాల వీధి, వీరఘట్టం గ్రామం, మండలం. పోలీసుల విచారణలో నిందితులు మద్యపానానికి బానిసై, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. దొంగిలించిన వాహనాల్లో కొన్ని విక్రయించగా, మరికొన్నింటిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి కంబరవలస గ్రామంలోని వెటర్నరీ హాస్పిటల్ ప్రాంగణం వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో నిందితులు మరిన్ని ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించడంతో, వారి సమాచారం మేరకు మధ్యవర్తుల సమక్షంలో మొత్తం ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు: – AP39DW1182 – TVS Radeon – AP40BF0164 – Bajaj Pulsar 150 CC – AP40BN0904 – Bajaj Pulsar 125 CC – AP39AD2784 – Bajaj Pulsar 150 CC – AP30AC4744 – Bajaj Pulsar 150 CC దర్యాప్తులో నిందితుల ప్రమేయం ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో కూడా ఉన్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. బుడరాయవలస పోలీస్ స్టేషన్ Cr.No.34/2026, పెందుర్తి పోలీస్ స్టేషన్ Cr.No.381/2026, తెర్లాం పోలీస్ స్టేషన్ Cr.No.45/2026, కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ Cr.No.170/2026 కేసుల్లోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. నిందితులను చట్ట ప్రకారం అరెస్ట్ చేసి తదుపరి న్యాయపరమైన చర్యల కోసం కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కేసును ఛేదించడంలో సమర్థవంతంగా పనిచేసిన వీరఘట్టం ఎస్సై షణ్ముఖరావు, పోలీస్ సిబ్బందిని పాలకొండ డీఎస్పీ M. రాంబాబు అభినందించారు. కార్యక్రమంలో పాలకొండ సీఐ ప్రసాద్ రావు, వీరఘట్టం ఎస్సై షణ్ముఖరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు పోలీసుల సూచనలు ఇళ్లకు తాళాలు వేసి కొన్ని రోజుల పాటు బయటకు వెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో నిలిపి తప్పనిసరిగా లాక్ చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. అలాగే వాహనాల పత్రాలను భద్రంగా ఉంచుకోవడంతో పాటు, వాహనాలను కొనుగోలు లేదా విక్రయించే సమయంలో సంబంధిత పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. 9 న్యూస్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్ Spread the love టపా నావిగేషన్ సాలూరు లో రాజన్నదొర అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అమావాస్య పర్వదినాన ప్రత్యేక అలంకరణలో పారమ్మ తల్లి