సాలూరు: సాలూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం జరిగింది. మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజన్నదొర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాజన్నదొర సూచించారు..

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు..

9 న్యూస్ రిపోర్టర్
శ్రావణ్ కుమార్

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి