**పిఎంఎస్ఎంఎ, సంచార చికిత్సా శిబిరం తనిఖీ*
**గర్భిణిలు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యంపై పర్యవేక్షణ ఉండాలి: ఎన్.సి.డి పిఓ డాక్టర్ జగన్ మోహన్*
*
పార్వతీపురం రూరల్, ఫిబ్రవరి9: గర్భిణిలు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికపుడు పర్యవేక్షణ చేయాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. డోకిశీల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం సందర్శించి అక్కడ పిఎంఎస్ఎమ్ఎ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. గర్భిణిల వైద్య పరీక్షల వివరాలు ఎంసిపి కార్డులో పరిశీలించి హైరిస్క్ గర్భిణీల ఆరోగ్యం మెరుగుకు ఏ విధమైన కార్యాచరణ చేస్తున్నారు అని వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, పౌష్టికాహారం సరిగా తీసుకుంటున్నారా అని పర్యవేక్షణ తప్పనిసరి అని తద్వారా రక్తహీనత నివారణ, గర్భిణీ తగ్గ బరువు,సురక్షిత ప్రసవం సాధ్యమని తెలిపారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్యాన్ని పరిశీలించారు.అనంతరం గ్రామంలో గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించి సిక్ రూమ్, సిక్ రిజిస్టర్ నిర్వహణ తనిఖీ చేశారు. తాళ్ళబురుడి గ్రామంలో సంచార చికిత్సా శిబిరాన్ని తనిఖీ చేసి దీర్ఘకాలిక రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతీ నెలా వారి ఆరోగ్యం ఏమేరకు మెరుగవుతుంది పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎన్సిడి సర్వే ఆన్లైన్ లో పరిశీలించారు. అక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హెల్త్ స్క్రీనింగ్, 4డి వివరాలపై తెలుసుకున్నారు. పిల్లలు, కేంద్రం పరిశుభ్రంగా ఉండేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ బి. ఐశ్వర్య, డా. మేఘన, డిప్యూటీ డెమో ప్రసాద్ , ఎం.ఎల్.హెచ్.పి భూలక్ష్మీ, వైద్య ,అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






