జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు పోలీసుశాఖ కఠిన చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా జిల్లాలో ఎవరైనా గంజాయి వినియోగిస్తున్నట్టు సమాచారం అందించినా లేదా గంజాయి అమ్ముతున్న వారిని పట్టించినా *రూ.5,000 నగదు బహుమతి* అందజేస్తామని జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* ఆగష్టు 12న ప్రకటించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు, నేరాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని, వీటి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. గంజాయి సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయిల్ 100/112 కు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. Spread the love టపా నావిగేషన్ అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న “భరత్ రాఘవ @ మాంసం నాని” అనే వ్యక్తి పై రౌడీ షీట్ కేసు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 150 అడుగుల జాతీయ జెండా తో భారీ ర్యాలీ