*పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి పూర్ణపాడు లాభేసు గ్రామాల మధ్య నాగవల్లి నదిపై అసంపూర్తి 20 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ వంతెన పనులు ఏప్రిల్ 10వ తేదీ లోపు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా* *ఈ విషయంపై ఆందోళన చేపడుతామని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ గారు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఈరోజు అనగా బుధవారం ఈ వంతెన పనులు సిపిఎం పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులతో కలిసి వంతెన పెండింగ్ పనులు నదిలో దిగి పిల్లర్లను పరిశీలించి అనంతరం నదిలో నుండి పత్రిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ కొమరాడ మండలానికి సంబంధించి 9 పంచాయతీలు 43 గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన ఈ వంతెన 2006వ సంవత్సరంలో సిపిఎం పార్టీ పోరాటం ఎమ్మెల్యే కోలక లక్షణామూర్తి అసెంబ్లీలో పోరాట ఫలితంగా అప్పుడు ప్రారంభించిన ఈ వంతెన నేటికీ మూడు పిల్లర్లు కట్టలేక గత 20 సంవత్సరాలుగా ఈ వంతెన పూర్తి కాక నాగావళి నది ఆవల ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పూర్ణపాడు లాభేసు వంతెన పెండింగ్ పనులు వర్షాకాలం రాకముందే ఈ వేసవిలోనే పనులు ప్రారంభించి వంతెన పూర్తి చేసి గిరిజన ప్రజలకు భరోసా కల్పించాలని కూటమి ప్రభుత్వానికి కోరుతున్నాం ఎందుకంటే గిరిజనుల ఓట్లతో పదవులు పొందుతున్న పాలకులు తర్వాత ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు*. *ప్రతిపక్షంలో ఉండే సందర్భంలో సిపిఎం పార్టీ చేసిన పోరాటాలకు వస్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వంతెన పెండింగ్ పనులు ప్రారంభిస్తామని చెప్పి నెలలు గడుస్తున్న పనులు ప్రారంభించిన పరిస్థితి దీని ఫలితంగానే పూర్ణపాడు లాభేసు వంతన అసంపూర్ణంగా ఉన్న పరిస్థితి ఉంది. తొమ్మిది పంచాయతీలు సుమారు 43 గ్రామాల ప్రజల ఇబ్బందులను పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు*. *వర్షాకాలం వస్తే బాహ్య ప్రపంచంతో సత్సంబంధాలు ఆయా గ్రామాలు కోల్పోయే పరిస్థితి ఉందని వర్షాకాలంలో ఇటు నాగావళి నది అటు గుమ్మిడిగెడ్డ ఉధృతంగా ప్రవహించే సమయంలో మండల, జిల్లా కేంద్రాలకు వేసవి కాలంలో ఐదు కిలోమీటర్ల దూరంలో వచ్చే సందర్భంలో వర్షాకాలం వస్తే నాగావళి నది ఆవల ఉన్న గ్రామాల ప్రజలు రావాలంటే కురుపాం మీద నుండి సుమారు 60 నుండి 70 కిలోమీటర్లు రాకపోకలు సాగించే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో 1996లో అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దు నాగవల్లి నదిపై గతంలో నాటు పడవల ప్రమాదాలు, పలువురు మృత్యువాత చెందిన సంఘటనలు లేకపోలేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందక పలువురు మృత్యువాత పడిన ఘటనలు కోకొల్లలు ఇప్పటికే ఉన్నాయని*. *వర్షాలు విపరీతంగా పడే సమయంలో నిత్య అవసరాలకు సైతం ఇబ్బందులు ఆయా గ్రామాల ప్రజలు పడుతుంటారన్నారు. వర్షాకాలంలో నది దాటే సమయంలో పలువురు మృత్యువాత పడే సంఘటనలు లేకపోలేదు అన్నారు. అటువంటి ప్రమాదకర గిరిజనులకు అత్యవసరమైన పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణానికి శతాబ్దాల కాలంగా పాలకులు శ్రద్ధ చూపకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సందర్భంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు, గిరిజనులకి ఉద్ధరిస్తామని చెప్పడమే తప్ప గిరిజనుల బాగు కోసం వారి అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులకు ఈ వంతెన ఎందుకు పూర్తి చేయరని ఈ సందర్భంగా* *రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నామని తక్షణమే ఏప్రిల్ 10వ తేదీ లోపు ఈ వేసవిలోనే పూర్ణపాడు లాభేసు వంతెన పెండింగ్ పనులు పూర్తి చేయాలని లేనియెడల ఏప్రిల్ 10వ తేదీ దాటిన తర్వాత ఈ సమస్యని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాకాడ ఇందిర ఎన్ వి నాయుడు సిపిఎం పార్టీ కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మరియు లాభేస్ పూర్ణ పాడు గ్రామానికి చెందిన యువకులు పాల్గొన్నారు Spread the love టపా నావిగేషన్ పొరుగు జిల్లాల కంటే భిన్నంగా నాణ్యమైన జర్నలిజం ఉండాలి ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం*