పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో రోడ్డు విస్తరణ పై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర మాట్లాడుతూ
మున్సిపల్ కౌన్సిల్ ఉన్నంతవరకు ఎందుకు విస్తరణ పనులు చేపట్టలేదు అంటూ ప్రశ్నించారు. అప్పుడు లేనిది ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తామనడం విడ్డూరంగా ఉంది అని విస్తరణ చేపట్టాలంటే రోడ్డుకి ఇరువైపుల ఉన్న దుకాణదారులకు,ఇంటి యజమానులకు ముందుగా నోటీసులు ఇవ్వాలి ఆతరువాత నిర్ణయం తీసుకోవాలి అని అంతేతప్ప హడావుడిగా రోడ్ల విస్తరణ అంటూ చర్యలు తీసుకోవడం సరికాదని సాలూరు మాస్టర్ ప్లాన్ ను అప్పటి ఆర్డీఓ అంబేద్కర్, సుదర్శనదొర ల సమక్షంలో  అధికార,ప్రతిపక్ష పార్టీ వారితో పాటు ఎన్‌జిఓ లతో కూడా సమావేశం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు….మెయిన్ రోడ్ విస్తరణ సమయంలో షాపులు పై జీవిస్తున్న తమ‌ బ్రతుకులను గుర్తుంచుకొని విస్తరణ చేయాలని ప్రాధేయపడ్డారు…..అటువంటి మాస్టర్ ప్లాన్ లేకుండా నేడు తెదేపా మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తుందన్నారు.గతంలో వచ్చిన మాస్టర్ ప్లాన్ సమగ్రంగా లేదని పునః సమీక్షించుకోవాలని సూచించానన్నారు…..ఎన్నికల ముందు హడావుడి చేయడం అలవాటయిందన్నారు…..మున్సిపాలిటీ కి జాతీయ స్థాయి అవార్డులు తన హయంలోనే వచ్చాయని గుర్తు చేశారు….రెండేళ్ళు అయిన మరుగుదొడ్లు నిర్మాణం,నిర్వహణ చేపట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి