పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆదివారం రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో పట్టణ జాతీయ రహదారి నుండి ఎన్టీఆర్ కొండల వద్ద నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అమరావతి కి చట్ట బద్రత కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద నుంచి మామిడిపల్లి కుండలి లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల 12 ఏళ్ల కల ఈనాటికి నిజమైందని దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు అమరావతి లో రాజధాని నిర్మాణానికి మద్దతు ఇస్తే ఒక్క వైకాపా మాత్రం వ్యతిరేకిస్తుందన్నారు. వైకాపా నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ రాజధాని నిర్మాణమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని వారికి సహకరించిన ప్రధానమంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Spread the love టపా నావిగేషన్ రోడ్ల విస్తరణకు ముందడుగు అంటూ ఊదరగొట్టారు. _సాలూరు లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి: మెగా ఉచిత వైద్య శిబిరం_