సాలూరు పట్టణ పరిధిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లైన మామిడిపల్లి జంక్షన్, గాంధీనగర్ జంక్షన్ మరియు బైపాస్ రోడ్ ప్రాంతాలను సంయుక్తంగా పరిశీలించడం జరిగింది.
ఈ తనిఖీలను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జె.వి.ఎస్.ఎస్.ఎస్. ప్రసాద్ గారు, ఆర్ & బి శాఖ AEE సాలూరు శ్రీ విజయ్‌కుమార్ గారు మరియు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గారు కలిసి నిర్వహించారు.
ప్రమాదాలను నివారించేందుకు క్రింది చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు:
• జంక్షన్ల వద్ద దిశా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం
• స్పీడ్ లిమిట్, ప్రమాద ప్రాంతం, మలుపు సూచిక వంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం
• జీబ్రా క్రాసింగ్‌లు, స్టాప్ లైన్లు మరియు స్పీడ్ బ్రేకర్లపై రిఫ్లెక్టివ్ పెయింటింగ్ చేయడం
• జంక్షన్ ముందు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించడం
• తగినంత వీధి దీపాల ఏర్పాటు
• రోడ్డు పక్కన కనిపించే దృశ్యాన్ని అడ్డుకుంటున్న పొదలు, మొక్కలను తొలగించడం
• బ్లైండ్ కర్వ్‌లు మరియు జంక్షన్ల వద్ద కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేయడం
• మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు
• బైపాస్ రోడ్ పై భారీ వాహనాల రాకపోకలపై ప్రత్యేక పర్యవేక్షణ

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి