గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ, ఐపిఎస్, ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఏప్రిల్ 11న ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు*

చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో రేగిడి ఆముదాలవలస పోలీసు స్టేషన్ పరిధిలోని చిన శిర్లాం గ్రామంలో సుమారు 70మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు*
  చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో సుమారు 120 ఇండ్లలో, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు*
రికార్డులు సక్రమంగాలేని మొత్తం 13 మోటారు సైకిళ్ళను సీజ్ చేసి, సంబంధిత పోలీసు స్టేషనుకు తరలించిన పోలీసులు*

గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ,ఐపిఎస్,ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఏప్రిల్ 11న తెల్లవారుజామున 5 గంటల నుండి జిల్లాలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు. *“ఆపరేషన్ వజ్రప్రహార్”* లో భాగంగా ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, నాటుతుపాకులు, నాటుసారా, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు.

జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గారి  ఉత్తర్వుల మేరకు  చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో రేగిడి ఆముదాలవలస పోలీసు స్టేషన్ పరిధిలోని చిన శిర్లాం గ్రామంలో సుమారు 70మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఈగల్ సభ్యలుతో బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యంగా సుమారు 120 ఇండ్లలో, బహిరంగ ప్రదేశాల్లో 350 వ్యక్తులను ఆకస్మికంగా సోదాలు నిర్వహించామన్నారు. చిన శిర్లాం గ్రామంలో అన్ని ఇండ్లలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, అపరిచత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో సేకరించామన్నారు. అదే విధంగా వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని 13 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం పోలీసు స్టేషనుకు తరలించామన్నారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్భందనం చేసామన్నారు. రాబోయే రోజుల్లో “ఆపరేషన్ వజ్రప్రహార్”భాగంగా ఇదే తరహాలో జిల్లాలో తరుచూ మరిన్ని ప్రాంతాల్లో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్స్ ఆకస్మికంగా చేపట్టనున్నామన్నారు. జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* వారి సూచనలు, ఆదేశాలమేరకు ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందితో చీపురుపల్లి డిఎస్పీ మమేకమై “కార్డన్ అండ్ సెర్చ్” ఉద్ధేశ్యాన్ని, ఈ ఆపరేషన్ లో అధికారులు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించి, ప్రజలతో దురుసుగా వ్యవహరించవద్దని దిశా నిర్దేశం చేసారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషనులో ఎటువంటి నిషేధిత వస్తువులు, గంజాయి, నాటుసారావంటివి లభ్యం కాలేదన్నారు. చిన శిర్లాం గ్రామంలో హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తులతో మాట్లాడి, వారి కదలికలపై నిత్యం నిఘా ఉంటుందని తెలిపారు. “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషను తరువాత గ్రామస్థులతో చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు సమావేశమై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళల రక్షణ చట్టాలపై గ్రామస్థులకు అవగాహన  చేపట్టి, గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు గాని, డయల్ 100/112కు గాని, స్థానిక పోలీసు స్టేషన్ కు గాని సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అనంతరం అక్కడ ఉన్న యువత, ప్రజలతో యాంటి డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించి, గంజాయి వలన కలిగే దుష్ప్రభావాలను వివరించి ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్ళకుండా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సిఐ ఉపేంద్ర, పలువురు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది మరియు ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి